సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.
8
"యన్నే, యంబ్రేయనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు."
9
అయినను వారి అవివేకమేలాగు తేట పడెనో ఆలాగే వీరిది కూడ అందరికి తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు.
10
"అయితే నీవు నా బోధను నాప్రవర్తనను నా ఉద్దేశ్యమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును,"
11
అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసికొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను.
12
క్రీస్తుయేసు నందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారందరు హింస పొందుదురు.
13
అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు
14
క్రీస్తుయేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగిచుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక
15
నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి ఎవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలకడగా ఉండుము.
16
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి.
17
"ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించు టకును, తప్పుద్దిదుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది."